|

Pawan Kalyan Tweets Twitter Fans

Nitin says “powerstar congratulatd me on d success of ishq n is goin to watch ishq in a couple of days.. told powerstar bout al his twitter fans and he says HII to u all.. ”. There are millions of fans spread across the World for Power Star who are eagerly waiting for the release of his upcoming movie Gabbar Singh.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదు. మరి ఆయన తన ట్విట్టర్ అభిమానులను ఎలా పలకరించారంటే..? తన అభిమాని, హీరో నితిన్ నటించిన ‘ఇష్క్’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఇటీవల నితిన్ పవర్ స్టార్‌ను కలిశాడట. పవర్ స్టార్‌తో తన అనుభవాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు ఈ యువహీరో. 

‘‘ ఇష్క్ సినిమా విజయవంతం కావడంపై పవర్ స్టార్ నాకు కంగ్రాట్స్ చెప్పారు. త్వరలోనే నా సినిమా చూస్తానన్నారు. అదే విధంగా ట్విట్టర్ ను ఫాలో అయ్యే తన అభిమానులకు హాయ్ చెప్పమని చెప్పారు’’ అంటూ తన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు నితిన్. ఈ విషయం ట్విట్టర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ స్టార్ ఫ్యాన్‌కు పాకి..సర్వత్రా సచర్చనీయాంశం అయింది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. హిందీ దబాంగ్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం విడుదలపై అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో నటించనున్నాడు.


Posted by Andhra Gossips on 00:46. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips