Nayanatara or Anushka - Who is Rani Rudrama Devi?
Rani Rudrama would be Nayanatara or Anushka.
నయనతార,అనూష్క ఇద్దరూ ఇప్పుడు గుణశేఖర్ తాజా చిత్రం 'రుద్రమదేవి'హీరోయిన్ రేసులో ఉన్నారు. జేజమ్మగా అరుంధతిలో అదరకొట్టిన అనూష్క అయితే బావుంటుందని కొందరు కాదు..సీతమ్మ తల్లిగా శ్రీరామ రాజ్యంలో నిలిచిపోయిన నయనతార అయితే బెస్ట్ అని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. అయితే గుణశేఖర్ ఇద్దరికీ స్క్ర్రిప్టు చెప్పాడని,అయితే ఇద్దరిలో ఎవరూ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. గుణశే్ఖర్ వరస ప్లాపుల్లో ఉండటంతో ఏ హీరోయిన్ కూడా ఆయన సినిమాలో చేయటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అందులోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే హీరోల సినిమాలకు దూరమవ్వటమే అని భావిస్తున్నారు. ఇక గుణశేఖర్ 'రుద్రమదేవి' పాత్ర కోసం ఇద్దరు సౌత్ లో ఇద్దరు పెద్ద హీరోయిన్స్ ని సంప్రదించారని చెప్పారు. ఆ హీరోయిన్స్ అనుష్క, నయనతార అని తెలిసింది. అలాగే వీరిద్దరి తో పాటు ప్రియాంక చోప్రాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నయనతారే ఖాయిం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నిప్పు చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రవితేజ హీరోగా వైవియస్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ ప్రాజెక్టు గురించి మీడియోతో ..''ఒక్కడు' తరవాత మొదలైన ఆలోచన 'రుద్రమదేవి'. అప్పటి నుంచీ ఈ కథపై కసరత్తు చేస్తూనే ఉన్నాను. ఇలాంటి కథను టెక్నికల్ గా అత్యున్నత విలువలతో నిర్మించాలి. అందుకే ఇంతకాలం వేచి చూశాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఈ కల త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది'' అని చెప్పారు. ఇంతకీ హీరోయిన్ ఓకే అయినప్పుడే కదా ప్రాజెక్టు పట్టాలెక్కేది అంటున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ఈ సినిమా చేయనున్నారో చూడాలి.
