వైవిఎస్...బాలయ్య ‘సీఎం’ ఎందుకు చేయడం లేదు?
YVS previous project with Balakrishna was ‘Okka Magadu’ which was a disaster at the box office. YVS's subsequent projects were also a dud including his recent outing ‘Nippu’. Perhaps all this might have prompted Balayya to stay away from YVS.
బాలయ్య హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘సీఎం’(కామన్ మేన్) చిత్రం రూపొందుతోందని, బొమ్మరిల్లు వారి సినిమా బ్యానర్‌పై వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరినీ విస్మయానికి గురి చేస్తూ...తనకు, తన బ్యానర్‌కు ఆ సినిమాతో సంబంధం లేదని, తాను బాలయ్యతో సినిమా చేయడం లేదని నిన్న ప్రెస్ స్టేట్ మెంట్ ఇచ్చారు వైవిఎస్.
నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు...వైవిఎస్‌కు ఆ సినిమాతో సంబంధం లేకుంటే మీడియాలో, టీవీ చానళ్లలో వార్తలు ఎలా వచ్చాయి? అనే అనుమానాలు వెల్లు వెత్తుతున్నాయి. వైవిఎస్ ఈ సినిమా ప్రాజెక్టు నుంచి కావాలని తప్పుకున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా వైవిఎస్ నిర్మించిన ‘నిప్పు’ ఇటీవల విడుదలై ప్లాపవడం కూడా ఇందుకు ఓకారణం అంటున్నారు.
గతంలో బాలయ్యతో ‘ఒక్క మగాడు’ చిత్రాన్ని నిర్మించిన వైవిఎస్ ఆ తర్వాత అన్నీ పరాజయాలే చవి చూశాడు. ‘నిప్పు’ సినిమా విడుదలకు ముందు బాలయ్యతో ‘సీఎం’ సినిమా సూచన ప్రాయంగా అనుకున్నప్పటికీ ‘నిప్పు’ డిజాస్టర్‌తో ఆ ప్రయత్నాన్ని విమరించుకున్నారని అంటున్నారు. అయితే మీడియాతో మాత్రం ఆ సినిమాకు తానే నిర్మాత అని ప్రచారం సాగుతుండటంతో ప్రెస్ నోట్ ఇచ్చి ఖండించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
