సునీల్... నీకెందుకయ్యా సిక్స్ ప్యాక్...
ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుకు కాస్త నోటి దురుసు ఉందని అందరూ అంటుంటారు. దానివల్ల చాలామందిని దూరం చేసుకున్నాడని అంటారు. షూటింగ్‌లో ఇతరులపై కామెంట్లు చేయడం ఆయనకు అలవాటట. లేడీ ఆర్టిస్టులయితే ఇక చెప్పక్కర్లేదనీ, కుళ్లు జోకులు వేస్తుంటాడని టాలీవుడ్ న్యూస్.
ఇక చలపతిరావు వేసినా... ఆయనది సెపరేట్. కానీ కోట అలా కాదట.. కుళ్లు జోకులతో వారిని హింసించేస్తుంటాడట. దాంతో వారు అతనితో కనీసం ఫోన్లోనైనా మాట్లాడాలంటే జడుసుకుంటుంటారట. నటుడు సునీల్ విషయంలో అలాగే జరిగింది.
పూలరంగడు షూటింగ్ మొదట్లో ఫొటో సెషన్ చేశారు. బాగా చిక్కిపోయినట్లున్నాడు సునీల్. 6 ప్యాక్ వల్ల ఇలా జరుగుతుందని తెలుసు... కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో సునీల్ తండ్రిగా చేశాడు. చేసింది చిన్న పాత్రే అయినా.. షూటింగ్ జరిగినంతసేపు సునీల్ బుర్ర తినేశాడట.
ఏమిటి.. నీకిది అవసరమా? టైఫాయిడ్ వచ్చిన వాడిలా ఉన్నావు... హీరోలకు సిక్స్‌ప్యాక్ అది సెపరేట్ బ్యాచ్ ఉంది. నీకెందుకు కామెడీ ఆర్టిస్టుగా.. నలుగురిని నవ్వించి.. ప్రేమికుడిగా, ఫ్యామిలీ ఆడియన్స్‌గా నీకంటూ సెపరేట్ ఉన్నారంటూ... ఇది మానేయ్ అని తన ధోరణిలో చెబుతూనే... కన్పించినప్పుడల్లా సెటైర్ వేసేవాడట.
ఆ తర్వాత దర్శకుడు తీసే విధానంలో... కూడా వేలుపెట్టి కెలికాడట. సిక్స్‌ప్యాక్ హీరోను ఎలా చూపిస్తావ్.. అంటూ జోరీగలా చెవి వద్ద ఒకటే మోగేశాడట. కానీ ఆ విషయం చివరివరకు దర్శకుడు చెప్పలేదట. ఆ తర్వాత ఏమైందీ.. పూలరంగడు విడుదల.. సక్సెస్. దాంతో కోట నీళ్లు నమిలాడట. దీన్నిబట్టి అర్థమైంది ఏంటయా.. అంటే ఎవడి పని వాడు చేయాలి.
వచ్చామా... చేశామా.. వెళ్ళామా.. అన్నట్లు ఉండాలని... తెలుసుకున్నానని.... పూలరంగడు సక్సెస్‌మీట్‌లో కోట తన మనసులో మాటను బయటపెట్టారు. దాంతో.. అవును కరేక్టె అని కొంతమంది అన్నారు. సక్సెస్ కాబట్టి.. ఇలా మాట్లాడాడు. లేదంటే.. ఫొటోలో చూపించినట్లు.. నేను చెప్పాను కదా..అని కాలర్ ఎగరేసేవాడు అని మరికొందరు అన్నారు. అంతేకదా మరి.
