రిలీజ్ లోనూ 'రచ్చ' రచ్చే
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ రోజుకో న్యూస్ తో టాలీవుడ్ ని వేడిక్కిస్తోంది. తాజాగా రామ్ చరణ్ అభిమానులుకు ఆనందం కలిగేలా ఒకేసారి రచ్చ చిత్రాన్ని తెలుగు,హిందీ,మళయాళంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత తమిళంలో డిఫెరెంట్ పబ్లిసిటితో మార్కెట్ చేస్తారు. త్వరలో హిందీ మార్కెట్ లోకి రామ్ చరణ్ వెళ్తూండటంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ మగధీర చిత్రం మళయాళంలో విడుదలై మంచి వసూళ్లను తెచ్చిపెట్టింది. అక్కడ బన్నీకి మార్కెట్ ఉన్నట్లే రామ్ చరణ్ కి సైతం మార్కెట్ ఏర్పడింది.
ఈ నేపధ్యంలో అధ్యధిక ప్రింట్లతో మూడు భాషల్లో విడుదల చేసి మరో రికార్డుని క్రియేట్ చేయాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంపై రామ్ చరణ్ కి సైతం చాలా అంచనాలు ఉన్నాయి. ఆరెంజ్ చిత్రం ఫెయిల్యూర్ ని మరిచిపోయేలా ఈ మాస్ మసాలా చిత్రం రూపొందిందని చెప్తున్నారు. అలాగే గ్యాంగ్ లీడర్ లోని వానా వానా వెల్లు వాయే పాట రీమిక్స్ సైతం సినిమాకు హైలెట్ అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో భారీ ఖర్చుతో ఫైట్స్ ని షూట్ చేసారు. ఈ సినిమా తర్వాత ఫైట్స్ అంటే రామ్ చరణ్ అనేలా ఉంటాయని యూనిట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
