వర్మ "రెడ్డిగారు పోయారు" టార్గెట్ మెగాస్టార్ చిరంజీవేనా..?!!
రాంగోపాల్ వర్మ తెరకెక్కించనున్న రెడ్డిగారు పోయారు చిత్రం చిరంజీవికి డైరెక్ట్ ఎటాక్ ఇస్తుందన్న వాదనలు వినబడుతున్నాయి. గతంలో వర్మ అనేకసార్లు చిరంజీవిపై తన ట్విట్టర్ ఖాతాలో సెటైర్లు విసిరారు.
ఈ నేపధ్యంలో రెడ్డిగారు పోయారు చిత్రం ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపైనే అని వర్మ ప్రకటించారు. పైగా అడ్రెస్ లేని పార్టీలు, అడ్రెస్ లేని వ్యక్తులు పదవులను వెతుక్కుంటూ వస్తారంటూ తన ప్రెస్‌నోట్‌లో పేర్కొనడం చూస్తుంటే ఆ వ్యాఖ్యలు పరోక్షంగా చిరంజీవిని తాకినట్లు అనిపిస్తున్నాయంటున్నారు సినీజనం.
ఐతే ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు చిరంజీవి ఫ్యాన్స్. ఒకవేళ రాంగోపాల్ వర్మ అన్నయ్య చిరంజీవిని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తే అది అట్టర్ ఫ్లాప్ అవుతుందనీ, దీనికి ఉదాహరణగా దాసరి చిత్రం మేస్త్రీని చెపుతున్నారు. చూద్దాం.. వర్మ తన రెడ్డిగారు పోయారు చిత్రంలో ఎవరెవర్ని టార్గెట్ చేస్తారో...?
