Sneha is No-1
అదేంటి అగ్రతారలుగా వెలుగొందుతున్న అనుష్క, ఇలియానా, నయనతార, శ్రియ, త్రిష లాంటి వాళ్లు వున్నా, వారు కోటి రూపాయల పారితోషికం అందుకొంటున్నా స్నేహను నెం.1 అంటున్నారు అనుకుంటున్నారా?? స్నేహ మిగిలిన వారిలా అగ్రనాయికల జాబితాలో లేకపోయినా, కోటి క్లబ్ లో లేకపోయినా సినిమాల సంఖ్య పరంగా చూస్తే మాత్రం ఆమెదే అగ్రస్థానం. అవును ఈ హోమ్లీ ఇమేజ్ వున్న నాయిక చేతిలో ప్రస్తుతం అరడజను చిత్రాలు వున్నాయి. ఇక ఎవరెవరు ఎన్నెన్ని సినిమాలు చేస్తున్నారో ఓ సారి పరిశీలిద్దాం.
నయనతార: ఇటీవలే ఆమె కథానాయికగా నటించిన మలయాళ చిత్రం 'బాడీగార్డ్' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నయన్ చేతిలో తమిళ చిత్రం 'ఆదవన్', తెలుగులో ఎన్టీఆర్ తో 'అదుర్స్', మలయాళంలో 'ఎలెక్ట్రా' చిత్రాలు వున్నాయి.
అనుష్క: అరుంధతి ఇచ్చిన హైప్ తో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం అనుష్క తెలుగులో మహేష్ బాబు చిత్రంలో, 'వేదం' చిత్రాలతో పాటు మూడు తమిళ చిత్రాలతో రెండో స్థానంలో వుంది.
ఇలియానా: నితిన్ సరసన 'రెచ్చిపో', విష్ణు సరసన 'సలీం' కాకుండా విక్రమ్ సరసన ఓ తమిళ చిత్రం చేస్తోంది.
శ్రియ: తెలుగులో సినిమాలేవీ లేని శ్రియ తమిళంలో 'కుట్టి', 'జగ్గుభాయ్', 'చికుబుకు' చిత్రాలతో పాటు ఓ హాలీవుడ్ సినిమా చేస్తోంది.
త్రిష: త్రిష తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో 'నమో వెంకటేశా', హిందీలో అక్షయ్ కుమార్ సరసన 'కట్టా మిట్టా' సినిమాలో నటిస్తోంది.
ఇక స్నేహ విషయానికొస్తే తెలుగులో 'భవానీ ఐపియస్', దాసరి దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం, తమిళంలో 'నూట్రుక్కు నూరు', 'అరువడై', 'అంగాడి తెరు', 'మురట్టుకాళై', 'గోవా' చిత్రాలతో బిజీగా వుంటోంది. అంతే కాకుండా ఎప్పుడూ వివాదాల్లో వుంటూ వివాదాల్లో నయనతారను వెనక్కు నెట్టి అందులోనూ నెం.1 అనిపించుకుంటోంది.
