Katrina Kaif in a Hollywood Movie
Katrina Kaif has been allegedly offered a great deal by Hollywood and the actress has apparently gave a green signal to the project.
హాలీవుడ్ సినిమాల్లో మితిమీరిన శృంగారం ఉంటుందనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మన బాలీవుడ్ తో పోలిస్తే హాలీవుడ్ సినిమాల్లో ముద్ధు సీన్లు ఇంకాస్త రంజుగా, మరింత హాట్ గా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మన వాళ్లు ఇంగ్లీష్ సినిమాలు చేసేదే అలాంటి హాట్ సీన్ల కోసమే అనే అపవాదు కూడా ఉంది. అందుకే చాలా మంది భారతీయ హీరోయిన్లు హాలీవుడ్ లో నటించడానికి జంకుతుంటారు. ఇప్పటి వరకు హాలీవుడ్ తెరపై మెరిసిన తారలు ఇద్దరే. అందాల తార ఐశ్వర్యరాయ్, శృంగార తార మల్లికా శెరావత్ మాత్రమే. ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ లో కూడా అందంగా, అణకువాగా నటించి మంచిపేరే తెచ్చుకుంది. ఇక మల్లిక తన సెక్సీ ఇమేజ్ కు ఏమాత్రం డామేజీ ఏర్పడకుండా నగ్నంగా నటించింది.
తాజాగా హాలీవుడ్ బాటలో నటిచేందుకు బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ సిద్ధం అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయమై ఆమెను మీడియా ప్రశ్నించగా హాలీవుడ్ చిత్రాల గురించి చాంతాండ స్టోరీ చెప్పింది. ‘ హాలీవుడ్ చిత్రాల్లో మితిమీరిన శృంగారం వుంటుందని అంతా అంటుంటారు. మన చిత్రాల తరహాలోనే హాలీవుడ్ చిత్రాల్లో శృంగార సన్నివేశాలుంటున్నాయి. నాకు తెలిసి బాలీవుడ్‌కు హాలీవుడ్‌కు ఆ విషయంలో పెద్దగా తేడా కనిపించడంలేదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం వస్తున్న హాలీవుడ్ చిత్రాలు మన భారతీయ చిత్రాల స్థాయిలోనే ఎక్కడా మితిమీరిన శృంగార సన్నివేశాలు లేకుండా వుంటున్నాయి. ఒక వేళ స్క్రిప్ట్ డిమాండ్‌ని బట్టి ఆ సన్నివేశాలువున్నా ఎక్కడా అతిగా చూపించడంలేదు. మంచి అవకాశం లభిస్తే హాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చెప్పింది.
ప్రస్తుతం కత్రినా కైఫ్ ఏక్ థా టైగర్ చిత్రంలో నటిస్తోంది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ తో కత్రినా ఇందులో జోడికట్టం గమనార్హం. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న సినిమాను కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సొహైల్ సేన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2012 ఆగస్టు 18న విడుదల చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
