V V Vinayak Directs Jr NTR 12 Crores Remuneration Film
The most sought combination of Young Tiger NTR and dynamic director VV Vinayak is once again on the cards, says the buzz. Reportedly, Vinayak is keen to direct Jr NTR in his new movie produced by veteran producer KS Rama Rao.
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నిర్మాత కెఎస్. రామారావు నిర్మించే చిత్రంలోనటిస్తున్నారని, ఈ సినిమాకు సదరు నిర్మాత జూ ఎన్టీఆర్‌కు రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో ఆది, అదుర్స్ లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన వివి వినాయక్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి దర్శకత్వంలో ‘దమ్ము’ చిత్రంలో నటిస్తున్నాడు. జూనియర్ సరసన త్రిష,కార్తీక రొమాన్స్ చేస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో వైపు వివి వినాయక్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
