Super Star Gifts a BMW to a Super Star
Though it wasn't a great success for Ra.One, but Bollywood Baadshah Shahrukh Khan is overwhelmed with his Ra.One colleagues. Shahrukh Khan will soon be gifting five BMW 7 Series sedan worth Rs 1 crore to superstar Rajinikanth, Arjun Rampal and Anubhav Sinha as a gesture of thanks.
షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ పతాకంప రూపొందిన చిత్రం రా.వన్. ఇందులో షారుఖ్ హీరో కాగా, అతని భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ వెర్షన్ లలో కూడా ఒకే సారి విడుదలైన విషయం తెలిసిందే. .ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 3,500 ధియోటర్స్ లో రిలీజ్ చేసారు.దాదాపు 150 కోట్లకు పైగానే ఈ చిత్రంపై పెట్టుబడి పెట్టారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ 35 కోట్లు వచ్చాయి. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 77 కోట్లు వచ్చాయి. ఒవరాల్ గా 150 కోట్లను కూడా క్రాస్ చేసింది.
హిందీలో షారుఖ్ ఖాన్ నటించి, నిర్మించిన ‘రా.వన్’లో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాత్ర చేసినందుకుగాను సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఓ బిఎండబ్ల్యు కారుని కానుకగా ఇవ్వాలని షారుఖ్ ఖాన్ భావిస్తున్నాడట. పారితోషికం అడగకుండా రజనీ ఈ చిత్రంలో నటించారు. కానీ తన వంతు కృతజ్ఞతగా రజనీకి ఏదైనా కానుక ఇవ్వాలనుకుని షారుఖ్ భావిస్తున్నాడట. బిఎండబ్ల్యు కారుని బహుమతిగా ఇస్తే రజనీ రేంజ్ కి తగ్గట్టుగా ఉంటుందన్నది షారుఖ్ ఆలోచన అయ్యుండొచ్చు.
కోటిరూపాయలు విలువ చేసే బియండబ్ల్యు కారులను మరో ముగ్గురికి కూడా గిప్ట్ గా ఇవ్వనున్నాడని సమాచారం. వారిలో రజనీకాంత్, అర్జున్ రాంపాల్ మరియు అనుభవ్ సింగ్. రజనీకాంత్ గెస్ట్ రోల్ కనిపించారు. అర్జున్ సాల్ విలన్ రోల్ లో అద్భుతంగా నటించిన విషయం విధితమే. అనుభవసిన్హా ఈ సినిమా డైరెక్టర్. గిప్ట్ గా ఇవ్వనున్న బెంజ్ కార్లును ముంబాయ్ లోని లోకల్ డీలర్ దగ్గర ఆల్ రెడీ బుక్ చేయబడ్డాయని. అవి రాంగానే ఈ బహుమతులను షారుఖ్ ప్రెజెంట్ చేయనున్నాడని తాజాగా అందిన సమాచారం.
