Why Mahesh Babu Avoid Comedians
మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ లో పూరీ జగన్నాధ్ రెగ్యులర్ కామిడీ టీమ్ బ్రహ్మానందం, అలీ, ఎమ్ ఎస్ నారాయణ ఉండటం లేదని సమాచారం. దానికి కారణం మహేష్ బాబే అని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. దూకుడు క్రెడిట్ మొత్తం కామిడీకే వెళ్లిపోవటంతో కామిడీ బ్యాచ్ ని కొంతకాలం పాటు దూరం పెట్టాలనే నిర్ణయంతోనే మహేష్ ఈ చిత్రంకు వారిని ఎవాయిడ్ చేసాడంటున్నారు. అందులోనూ మీడియాలో దూకుడు లో కామిడీ హైలెట్ అయ్యిందని, ముఖ్యంగా బ్రహ్మానందం,ఎమ్ ఎస్ నారాయణ ఎపిసోడ్స్ హైలెట్ అయ్యాయని చెప్పుకోవటం కాస్త అప్ సెట్ కు గురిచేసిందని,దాని ఎఫెక్టే ఇది అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో కామిడీని కూడా మహేష్ పండించాడని అంటున్నారు. నిజానికి పోకిరి కాంబినేషన్ గా ఈ చిత్రం క్రేజ్ తెచ్చుకుంది.
పోకిరిలో హైలెట్ సీన్స్ లో బ్రహ్మానందం,అలీ ల ట్రాక్ కూడా ఒకటి. ఇక కేవలం ధర్మవరపు సుబ్రమణ్యం మాత్రమే ఈ చిత్రంలో ఉన్నాడని తెలుస్తోంది. ఇక బిజినెస్ మ్యాన్ బిజినెస్ కూడా ఓ రేంజిలో జరుగుతోంది. సంక్రాంతికి విడుదల అవుతున్న ఈ చిత్రం 2012 మెగా హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్టయ్యాయి. అలాగే డైలాగు ప్రోమోలు కూడా హాట్ టాపిక్ గా మారి చిత్రానికి క్రేజ్ తెచ్చిపెట్టాయి. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ముంబై నేపధ్యంలో జరిగే మాఫియా కథ అని చెప్తున్నారు.
