2 రోజుల్లో 5 లక్షల హిట్స్.. 'గబ్బర్‌సింగ్' రికార్డ్.!
'నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది' అన్న డైలాగ్‌తో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పోలీసాఫీసర్ గెటప్‌తో వచ్చిన 'గబ్బర్‌సింగ్' టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత, అగ్రనిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ - ''కేవలం రెండు రోజుల్లోనే 'గబ్బర్‌సింగ్' టీజర్‌కు 5 లక్షల హిట్స్ రావడం పెద్ద రికార్డ్. ఇండియాలో ఇంతకుముందు ఏ చిత్రం సాధించని ఈ రికార్డ్ మా 'గబ్బర్‌సింగ్' పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సాధించడం చాలా హ్యాపీగా వుంది. 'గబ్బర్‌సింగ్' సినిమా ముందు ముందు ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం'' అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.
