"గబ్బర్ సింగ్" అంటే చాలా భయమేసింది..: శ్రుతిహాసన్
అనగనగా ధీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో సిద్ధార్థ్ సరసన నటించిన శ్రుతిహాసన్ తాజాగా "గబ్బర్‌సింగ్" చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి.
పవన్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని శ్రుతి చెబుతోంది. ఇందులో తన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందనీ, కథ బాగా నచ్చిందని త్వరలో ఆ వివరాలు తెలియజేస్తానంది.
పవన్ చిత్రమంటే చాలామంది భయపెట్టారనీ, కానీ ఆయన్ను కలిసినప్పుడు చాలా విషయాల్లో ఖచ్చితంగా ఉన్నారనీ, అలాంటివారితో ఇబ్బందులు ఏమీ రావని తేల్చి చెబుతోంది.
