వరల్డ్ కప్ ఫైనల్‌కి 405 టిక్కెట్లు అమ్ముడు పోలేదా..?
Here is a piece of news that will shock cricket lovers in India who missed out on witnessing the World Cup 2011 final in Mumbai on April 2. Believe it or not, there were 405 tickets that were unsold, according to a report in a Mumbai newspaper on Monday
ముంబై: ఇండియాలో ఉన్న క్రికెట్ అభిమానులకు షాకిచ్చే న్యూస్. ఏప్రిల్ 2వ తారీఖున ముంబైలో వాంఖెడ్ స్డేడియంలో జరిగిన ప్రపంచ కప్ 2011 ఫైనల్ మ్యాచ్‌లో 405 టిక్కెట్లు అమ్ముడవ లేదని ముంబైకి చెందిన ఓ న్యూస్ పేపర్ సోమవారం కథనాన్ని ప్రచురించింది. ఇక వివరాల్లోకి వెళితే ఏప్రిల్ 2వ తారీఖున భారత్, శ్రీలంక మద్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖెడ్ స్డేడియంలో జరిగింది.
ఈ మ్యాచ్‌లో ధోని సేన 28 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్‌ని కైవసం చేసుకుంది. ఐతే ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ.. ఆరోజు నుండి ఇప్పటి వరకు స్డేడియంలో సుమారు 405 టిక్కెట్లు అమ్ముడవని విషయం మనకు తెలియ లేదు. ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఐతే వాంఖెడ్ స్టేడియంలో సీట్ల కెపాసిటీ మాత్రం 33,000.
టిక్కెట్లు అమ్ముడవని విషయాన్ని మిడ్ డే పత్రిక ముంబై క్రికెట్ అసోషియేషన్ ఆఫీసు నుండి స్వయంగా సంప్రదించి ప్రచురించినట్లు తెలిపింది. వాంఖెడ్ స్డేడియంలో సునీల్ గవాస్కర్ స్టాండ్ (లోవర్ బే)లో అమ్ముడవని 96 టిక్కెట్లు చూసి ఆశ్చర్యపోయారు. టిక్కెట్లు అమ్ముడవక పోవడం వల్ల ముంబై క్రికెట్ అసోసియేషన్ సుమారుగా రూ 73.5 లక్షలు నష్టపోయినట్లు సమాచారం.
