పాపం ఆమె పరిస్దితి..బిల్డప్ ఎక్కువ బిజెనెస్ తక్కువ
Mallika Sherawat’s Hollywood film Love, Barack or Politics Of Love might not see the light of day. The movie which Mallika signed during her stay in LA might end up gathering dust in the cans because the film reportedly has no distributors.
బాలీవుడ్ హాట్ భామ మల్లికా షెరావత్ హాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం 'హిస్..స్"బాలీవుడ్‌లోలానే తుస్‌మనిపించింది. మల్లిక అందాలు ఆ చిత్రాన్ని ఏరకంగానూ కాపాడలేకపోయాయి. ఆ చిత్రం తర్వాత ఎప్పుడో రెండేళ్ల క్రితం షూటింగ్ మొదలెట్టిన 'లవ్ బారక్-పాలిటిక్స్ ఆఫ్ లవ్" చిత్రం రీసెంట్‌గా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విలియం డియర్ ఈ చిత్రం ప్రమోట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.ఇంతవరకూ ఈ చిత్రాన్ని పంపిణీ చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని డివిడిలలోకి మార్చి కనీసం ఆ రకంగానైనా క్యాష్ చేసుకుందామనుకుంటున్నారట. ఒబామా అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఉన్న హవా..ఇప్పుడు అంతగా లేకపోవడం కూడా ఈ చిత్రానికి మైనస్ పాయింట్‌గా మారింది.ఈ చిత్రాన్ని లేట్ ప్రాజెక్టుగా విడుదల చేయడం కూడా ఈ సినిమాకు శాపంగా మారింది. కనీసం హాలీవుడ్‌లోనైనా తన అందంతో జనాన్ని పడగొట్టేద్దామనుకున్న మల్లికకు అక్కడ కూడా కాలం కలిసిరాకపోవడంతో విచారవదనంతో ఉంది.
