'వన్స్ అపాన్ ఎ టైమ్..' ఇలియానా
Southern sensation Ileana has bagged a major role in Bollywood. The hot actress is all set to star in the sequel of Once Upon A Time In Mumbai
అక్షయ్ కుమార్ హీరోగా నిర్మించబోయే 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై 2', 'ఖిలాడీ 786' చిత్రాల్లో ఇలియానాకు అవకాశం సంపాదించింది. 2010లో ఏక్తా కపూర్ నిర్మించిన 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై'కి ఈ చిత్రం సీక్వెల్ . మాఫియా డాన్‌లు దావూద్ ఇబ్రహీం (అక్షయ్), చోటా రాజన్ (షాహిద్)ల మధ్య గల శతృత్వమే దీని ఇతివృత్తం. ఇక రెండో సినిమా 'ఖిలాడీ 786'ని హాస్య ప్రధాన చిత్రంగా అక్షయ్, హిమేష్ రేష్మియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో అనురాగ్ బసు రూపొందించిన 'బర్ఫీ'లో రణ్‌బీర్ కపూర్ భార్యగా ఇలియానా చేయటం ఆమెకు కలిసివచ్చింది. అయితే రిలీజైన తర్వాత గానీ ఆమె కేరీర్ ఏ రేంజికి వెళ్తుందో చెప్పలేమంటున్నారు బాలీవుడ్ పండితులు. ఇక దక్షిణాదిలో ఇలియానా కెరీర్ విషయానికి వస్తే, 'కిక్' తర్వాత వరుసగా ఐదు ఫ్లాప్‌లు రావడంతో ప్రస్తుతానికి ఇక్కడ డల్‌గానే ఉంది.
ఈ మధ్యనే తమిళ దర్శకుడు శంకర్ తీసిన 'స్నేహితుడు' (అమీర్‌ఖాన్ '3 ఈడియెట్స్' రీమేక్)లో కనిపించిన ఈమెకు కలిసిరాలేదు. ఆ సినిమా ప్లాప్ కావటం ఆమెకు తెలుగులో ఇబ్బందికర పరిస్దితి తెచ్చిపెట్టింది. దాంతో ఆమె తన దృష్టి మొత్తాన్ని బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడిలో నటిస్తోంది. ఈ చిత్రం ఆమెకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందని భావిస్తోంది.
