అక్కడ' బిజినెస్ మ్యాన్'కి బిజినెస్ లేదా?
తెలుగులో ఘన విజయం సాధించిన మహేష్ చిత్రం బిజినెస్ మ్యాన్. ఈ చిత్రాన్ని తమిళం,మళయాళంలో కూడా విడుదల చేస్తామని రిలీజ్ కు ముందు చెప్పారు. అంతేగాక మూడు లాంగ్వేజ్ లు ఆడియోలు ఒకే స్టేజిపై విడుదల చేసి హైప్ క్రియేట్ చేసారు. అయితే రిలీజ్ అయ్యి ఇంతకాలం అవుతున్నా అక్కడ ఇంకా విడుదలకు నోచుకోలేదు. దానికి కారణం కేవలం బిజినెస్ కాకపోవటమే అంటున్నారు. నిర్మాతలు ఎక్సపెక్ట్ చేసిన రీతిలో బిజినెస్ ఆఫర్స్ రాకపోవటంతో ఆ సినిమాని అట్టేపెట్టారని చెప్తున్నారు.
గతంలోనూ మహేష్ సినిమాలకు పెద్దగా పెద్దగా బిజనెస్ జరగలేదు. దాంతో ఈ చిత్రం తమిళ, మళయాళ వెర్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్ధితి నెలకొందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక నిర్మాతలైన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు కూడా తెలుగులో ఊహించని విదంగా పెద్ద హిట్ అవటంతో ఆ మార్కెట్ పై ఆసక్తి లేదంటున్నారు. మరో ప్రక్క అదే బ్యానర్ లో చేసిన పూల రంగడు కూడా విజయం సాధించటంతో వీరు దృష్టి అటువైపు వెళ్లటం లేదంటున్నారు. ఇక మహేష్ ఇవేమీ పట్టించుకోకుండా తన నెక్ట్స్ ప్రాజెక్టు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో పాల్గొంటున్నారు. పూరి జగన్నాధ్ అయితే తన తదుపరి చిత్రం దేముడు చేసిన మనుషులు, పవన్ కళ్యాణ్ చిత్రాలకు స్క్రిప్టు వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు.
