|

అమెరికాలో ఇష్క్ రికార్డులు


పదమూడు ఫ్లాపుల తర్వాత వచ్చిన నితిన్ సినిమా ఇది. ఇప్పుడు నితిన్ కు కేవలం హిట్ ను ఇవ్వడమే కాకుండా మంచి ఎనర్జీని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఈ సినిమా. గజిని దండయాత్రల్లాగా, వరుసగా ఫ్లాపులు వచ్చినా అలాగే పోరాడినందుకు నితిన్ కు మంచే జరిగింది. ఇప్పటివరకు అమెరికాలో ఏ సినిమా సృష్టించని ఓ రికార్డును “ఇష్క్” సాధించింది.
మొదటి వారం కలెక్షన్ల కంటే రెండో వారం కలెక్షన్లు 125 శాతం ఎక్కువగా సాధించింది. ఇంతవరకు ఏ బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఈ రికార్డును సాధించలేదు. సాధారణంగా 30-40 ఎక్కువ కలెక్షన్లు వచ్చాయంటే అది బ్లాక్ బస్టర్ అని. కానీ, ఈ సినిమా వాటిని కూడా తిరగరాసింది. దీనికి కారణాలు మూడు ఒక టి ఎ సెంటర్ సినిమా కావడం, రెండు నిత్యమీనన్, మూడు పీసీ శ్రీరాం ఫొటోగ్రఫీ… ఇవి సినిమాకు వచ్చిన  ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. కేవలం మౌత్ టాక్ మీద ఈ సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నాయట.



Posted by Andhra Gossips on 03:41. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips