బిజినెస్‌లో..దుమ్ము రేపుతున్న ఎన్టీఆర్ ‘దమ్ము’
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాజా సినిమా ‘దమ్ము’ చిత్రం విడుదలకు ముందే బిజినెస్ పరంగా దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఉత్తరాంధ్ర హక్కులను భరత్ పిక్చర్ ఎవరూ ఊహించని రీతిలో రూ. 3.45 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం గుంటూరు, నెల్లూరు, కృష్ణా, నైజాం, కర్నాటక, ఈస్ట్, వెస్ట్ హక్కులు కూడా భారీ అమౌంట్‌కి అమ్ముడు పోయాయని తెలుస్తోంది.
సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం గుంటూరు, నెల్లూరు, కృష్ణ రైట్స్ ను బేకరీ ప్రసాద్ రూ. 7.2 కోట్లకు సొంతం చేసుకున్నారని, నైజాం మరియు కర్నాటక రైట్స్ దిల్ రాజు, కుబేరన్ పిక్చర్స్ రూ. 11 కోట్లకు సొంతం చేసుకున్నారని, మహా లక్ష్మి ఫిలింస్ వారు వెస్ట్ గోదావరి రైట్స్ రూ. 2 .10 కోట్లకు, ఈస్ట్ గోదావరి రైట్స్ ను గాయత్రి ఫిలింస్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. అదే విధంగా సీడెడ్ రైట్స్ ను మధు అనే డిస్టిబ్యూటర్ బంపర్ అమౌంట్ చెల్లించి సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే ఈ వివరాలు కేవలం అనధికారికంగా తెలిసినవి మాత్రమే. ఎవరెవరు ఎంత మొత్తానికి సొంతం చేసుకున్నారో అధికారికంగా తెలియాల్సి ఉంది.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘దమ్ము’ చిత్రంలో త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈచిత్రంపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
