|

రామ్ చరణ్ సినిమాకు 70కోట్లా?


రామ్ చరణ్ సినిమా బడ్జెట్ 70 కోట్లు అనేది షాకిచ్చే విషయమే. అయితే ఆ సినిమా హిందీలో తీస్తున్నాం కాబట్టి అంతలా షాక్ అవ్వాల్సిన పనిలేదు అంటున్నారు. బాలీవుడ్ లో రామ్ చరణ్ హీరోగా త్వరలో ప్రారంభం కానున్న జంజీర్ రీమేక్ కు ఈ రేంజి బడ్జెట్ ని రిలియన్స్ వారు ఎప్రూవ్ చేసారని సమాచారం. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కనిపించనున్నాడు. అగ్నిపథ్ లో విలన్ గా అదరకొట్టిన సంజయ్ దత్ ని ఈ పాత్రకు ఎంపిక చేస్తూండటంతో సినిమాపై మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. జంజీర్ లోని షేర్ ఖాన్ పాత్రను గతంలో ప్రాణ్ చేసారు. ఇప్పుడు సంజయ్ దత్ చేయనున్నారు. 


ఇక ఈ చిత్రం షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏప్రియల్ 20 న షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆ రోజు నుంచి పది రోజులు పాటు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వివి వినాయిక్ తో చేస్తున్న చిత్రం గ్యాప్ లో ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చాడు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యిన స్టార్ హీరోయిన్ ని రామ్ చరణ్ ప్రక్కన తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలయన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మించనున్నారు.


Posted by Andhra Gossips on 10:51. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips