Jr NTR Dammu Release Date
Jr NTR Dammu Release Date, Dammu Release Date, Jr NTR Dammu Release Date, NTR Dammu Release Date
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ‘దమ్ము’ చూడటానికి ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల ఎప్పుడు అనే విషయం ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. త్రిష, కార్తీక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రొమాన్స్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వీటిలో ఒక పాత్రలో కోర మీసంతో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఫ్యాక్షనిస్టు పాత్రలో ఫాదర్ గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుమారుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం.
యాక్షన్ అండ్ మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. క్రేజీ హీరో ఎన్టీఆర్ కావడంతో దర్శకుడు బోయపాటి అతని క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ విషయంలో ప్రత్యేక శద్ద తీసుకుంటున్నారు. ఇప్పటికే బయటకు లీకైన దమ్ము డైలాగులకు అభిమానులను మంచి రెస్పాన్స్ వస్తోంది కూడా.
