|

ఎన్టీఆర్ ‌'దమ్ము' గురించి చెప్పే శ్లోకం హైలెట్


ఎన్టీఆర్‌ తాజా చిత్రం 'దమ్ము'ఆడియోలో ఓ ప్రత్యేక శ్లోకం కూడా ఉండబోతోంది . ఈ విషయాన్ని నిర్మాత మీడియాకు తెలియచేసారు. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎ.వల్లభ నిర్మాత. ఉగాది సందర్భంగా ఈ నెల 23న పాటలు విడుదల చేస్తారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుగుతోంది. 


ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నిర్మాత మాట్లాడుతూ..మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌, కీరవాణి కలయికలో వచ్చిన 'స్టూడెంట్‌ నెం.1', 'యమదొంగ' చిత్రాలు సంగీతపరంగానూ ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. ఈసారి కూడా ఆ విజయపరంపర కొనసాగుతుంది. ఐదు పాటలున్నాయి. ఎన్టీఆర్‌ దమ్ము గురించి చెప్పే ఓ శ్లోకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. డాన్స్ ల విషయంలో కూడా ఆయన చాలా శ్రద్ధ తీసుకొన్నార''న్నారు. ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు. 


Posted by Andhra Gossips on 22:10. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips