‘నా కారులో వెళదాం బావా..’ఎన్టీఆర్ తో రామ్ చరణ్
‘బాద్‌షా’ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ తేజ,ఎన్టీఆర్ ఇద్దరూ విడివిడిగా తమ కారులో వచ్చారు. కానీ వేడుక ముగించుకుని వెళ్లేటప్పుడు మాత్రం.. ఇద్దరూ ఒకే కారులో వెళ్లారు. ‘నా కారులో వెళదాం బావా..’ అని ఎన్టీఆర్‌ని ఉద్దేశించి చరణ్ అడగ్గానే... ‘ష్యూర్... నువ్ డ్రైవ్ చేస్తావా?’ అని ఎన్టీఆర్ అడగడం, ‘యా...’ అంటూ చరణ్ కారు లాగించడం నిమిషాల్లో జరిగిపోయాయి. ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్ హీరోయిన్ గా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రామ్‌చరణ్ క్లాప్‌నిచ్చారు. కార్యక్రమం అనంతరం ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజకీయంగా రెండు వేరు వేరు పార్టీలకు చెందిన కుటుంబాలకు చెందిన వీరిద్దరు ఇలా స్నేహంగా ఒకే కారులో వెళ్లడం, ఒకరి సినిమాకి ఒకరు క్లాప్ కొట్టడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఏమైనా ఇది చిత్రపరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్స్ వినపడడ్డాయి.
