హీరో స్టార్ డమ్ తర్వాతే దర్శకుడి స్థానం
Junior NTR is already a very big star and prime contender for the top seat in Tollywood. We all know that Rajamouli played big role in NTR’s journey to stardom. Even Rajamouli was benefitted by winning NTR’s faith as a director. They both are at the top in their respective areas and Rajamouli has moved on by doing various genres of films with various heroes.
మొన్నామద్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన క్రొత్త చిత్రం ఊసరవెల్లి ఆడియో విడుదల భారీ ఎత్తున జరిగింది. వందలాది మంది అభిమానులు, సినీ కళాకారులు, ఆర్టిస్టుల మధ్య శిల్ప కళా వేదిక, మాధాపూర్ లో జరిగిన విషయం విధితమే. ఈ కార్యక్రమానికి పలువు ప్రముఖులు హాజరయిన విషయం తెలిసిందే అందులో రాజమౌళి ఒక్కరు. ఈ కార్యక్రమంలో ఓ సందర్భంలో అతను వేదికపై ప్రసంగిస్తున్నప్పడు జూ ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడూ అని అభిమానులు ప్రశ్నించారు. అందుకు బదులుగా త్వరలోనే ఉంటుంది అన్నట్లు రాజమౌళి చెప్పాడు. కానీ రాజమౌళి చేతిలోంచి జూ ఎన్టీఆర్ మైకు లాక్కుని ఎప్పటికప్పుడు ఇలానే చెబుతున్నాడు. ఇప్పటికిప్పుడు మీరు నిలదియ్యండి..బయట రాజమౌళి గారి కారు ఉంది. ఆ కారుని ఎటాక్ చేసి నాతో ఎప్పుడు సినిమా తీస్తాడో అడగండి అని ఎన్టీఆర్ అడిగారంట. అయితే ఆ వార్తలను వక్రీకరించి జూ ఎన్టీఆర్ రాజమౌళి ని ఇండస్ట్రీ హిట్ కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ అడుక్కుంటున్నాడని వ్రాసాయి.
ఎటువంటి అనుమానం లేకుండా టాలీవుడ్ నెం 1 డైరక్టర్ రాజమౌళి అని సాటి దర్శకులు కూడా గర్వంగా చెప్పుకునే దర్శకుడు రాజమౌళి. తమ అభిమాన హిరోతో రాజమౌళి సినిమా చెయ్యాలని ప్రతి హిరో అభిమాని కోరిక. ఒక పక్క నుంచి పవన్ అభిమానులు, ఇంకో పక్క నుంచి మహేష్ బాబు అభిమానులు ట్విట్టర్ లో ఆయనను బాగానే రిక్వెస్ట్ చేస్తూ వుంటారు. అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ పై రాజమౌళికి ప్రత్యేక అభిమానం.
ఆ విధంగా ఎన్టీఆర్ అభిమానులకు మా డైరక్టర్ అనే అభిప్రాయం కూడా వుంది. ఎన్టీఆర్ తో మూడు సినిమాలు స్టూడెంట్ నెం 1, సిహాంద్రి, యమదొంగ తీసినా ’మగధీర’ తర్వాత ఆ సినిమాను మించిన మరో సినిమా చెయ్యాలని రాజమౌళి ఎన్టీఆర్ తో తీయ్యాలని అభిమానులు కోరుతూ వుంటారు. అభిమానుల కోరికను అసరాగా తీసుకొని ప్రతి ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ రాజమౌళిని ఆట పట్టిస్తూ వుంటాడు. అభిమానుల మధ్య పోటిలో బాగంగా వేరే హిరో అభిమానులు ఎన్టీఆర్ రాజమౌళిని సినిమా అడుక్కుంటున్నాడని ప్రచారం చేయడం జరుగుతుంది. హిరో స్టార్ డమ్ తర్వాతే దర్శకుడి స్థానం అని తెలిసిన రాజమౌళి ఆ రూమర్స్ ను పట్టించుకొవద్దని చెప్పడం బాగుంది.
