|

రామ్ చరణ్ ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన డైరెక్టర్...!?

Ram Charan is not a happy man as he is facing problems to shape up his career in right direction. He desperately needs to work with front line directors to be on the 'hot list'. Ram Charan watched Dookudu and was bowled over by Srinu Vytla's direction. He is particularly impressed with the way he balanced Mahesh's mighty image and his style of taking.



పెద్ద హీరోతో హిట్లివ్వలేక పోతున్నాడనే అపవాదుని ఎట్టకేలకు 'దూకుడు'తో అధిగమించాడు శ్రీను వైట్ల. 'దూకుడు'కి ముందు అతను చిరంజీవితో 'అందరివాడు', నాగార్జునతో 'కింగ్', వెంకటేష్ తో 'నమో వెంకటేశ' సినిమాలకి డైరెక్ట్ చేశాడు. వీటిలో 'అందరివాడు' కేవలం కొందరివాడిగానే మిగలగా, 'కింగ్' పాక్షికంగానే టైటిల్‌ ని జస్టిఫై చేయగలిగాడు. ఇక 'నమో వెంకటేశ' అయితే బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. పైగా ఈ సినిమాలో వెంకటేష్ ని మరీ జోకర్‌ గా చూపించడం విమర్శలకి తావిచ్చింది కూడా.


ఈ నేపథ్యంలో మహేష్ వంటి సూపర్‌ స్టార్‌ తో సినిమా చేసే అవకాశం రావడంతో స్క్రిప్టు విషయంలో చాలా జాగ్రత్తపడ్డాడు శ్రీను. మహేష్ కి మాస్, క్లాస్ రెండు వర్గాల్లో ఉన్న ఇమేజ్‌ కి, తన స్టైల్ కామెడీ టచ్ ఇవ్వడంలో అతను తెలివిగా వ్యవహరించాడు. మహేష్ అంటే ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాల్ని కోరుకుంటారు కాబట్టి అలాంటి సీన్లని పెడుతూనే, అతని కేరక్టర్లో వినోదాన్ని జోడించాడు. ఆఖరికి హీరోయిన్‌ తో అతడి సన్నివేశాలు సైతం వినోదాన్ని అందించడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.



దూకుడు రిజల్ట్ శ్రీను వైట్ల రేంజ్ ని ఒక్కసారిగా పెంచేసిందని సినిమా చూసిన పెద్దలు, చిన్నవారుకూడా ఒప్పేసుకుంటున్నారు. రీసెంట్ గా దూకుడు చూసిన రాజమౌళి కూడా మహేష్ క్యారెక్టర్ సెన్షేషనల్ హిట్ అని, సినమా చూసేంత సేపు చాలా ఇంట్రస్ట్ గా ఉందని తెలిపారు. ఇప్పుడు కుర్ర హీరోలందరూ ఈ టాప్ డైరెక్టర్ తో చేయాలని ఆశపడుతున్నట్టు వినికిడి. ముఖ్యంగా ఈ లిస్ట్ లో రామ్ చరణ్ ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల ‘దూకుడు’ చిత్రాన్ని చూసిన రామ్ చరణ్ చాలా ఇంప్రెస్ అయ్యాడట. శ్రీను వైట్ల టేకింగ్, హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అతను ఈ సినిమాకి చేసిన స్ర్కీన్ ప్లే చరణ్ ని బాగా ఇంప్రెస్ చేసిందని తెలుస్తోంది. పర్సనల్ గా శ్రీనువైట్లని కలిసి శుభాకాంక్షలు అందజేసి తనకు ఓ సినిమా చేసి పెట్టమని అడిగాడట. శ్రీనువైట్ల ఆల్ రెడీ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అంగీకరించేసాడు కాబట్టి చరణ్ ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడని ఇండస్ట్రీలో టాక్... ఇంకా కన్ఫాం అవ్వడానికి కొద్ది టైమ్ పడుతుందని అంతలోపు చరణ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 


Posted by Andhra Gossips on 23:13. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips