|

Lakshmi Manchu is Samantha Mother


మంచు లక్ష్మీ ప్రసన్న త్వరలో స్టార్ హీరోయిన్ సమంతకు తల్లిగా కనిపించనుందని సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న కడల్ చిత్రంలో ఆమె ఈ పాత్రను చేయనుందని చెన్నై పత్రికలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది. ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు సమంత. సమంత ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. ఇక అనగనగా ఒక ధీరుడు చిత్రంలో ఐరేంద్రిగా విలన్ రోల్ లో అదరకొట్టిన మంచు లక్ష్మి తన నటనకు ఎల్లలు లేవన్నట్లుగా వరసగా సినిమాలు ఒప్పుకుంటోంది. అందులో భాగంగానే హిందీ డిపార్టమెంట్ చిత్రంలో ఆమె సంజయ్ దత్ కి భార్యగా నటిస్తోంది. అలాగే ఆమె స్వయంగా నిర్మిస్తున్న చిత్రం గుండెల్లో గోదారి లోనూ ఆమె పాత్ర కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక అరవింద్ స్వామికీ రోల్ లో చేస్తున్న కడలి చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. 

రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. సమంత సరసన తమిళనటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ నటించనున్నాడు. గౌతమ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. మణిరత్నం సినిమా అంటే తమిళంతో పాటే తెలుగులో కూడా విడుదలవ్వనుంది. ‘కడలి’ టైటిల్ తో ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ అవుతుంది. ఈ విషయమై సమంత స్పందిస్తూ..‘‘మణి సార్ డెరైక్షన్‌లో నటించాలనేది నా కల మాత్రమే కాదు. ఇండియాలోని ప్రతి ఆర్టిస్ట్ కల. ఆ శుభ ఘడియ నాకు ఇంత త్వరగా వస్తుందని నేను ఊహించలేదు. దీన్ని గాడ్ గిప్ట్ గా భావిస్తున్నాను. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగినా కలగని ఆనందం మణి సార్ సినిమాలో చేస్తున్నందుకు కలిగింది’’అంది. ఇక సఖి తర్వాత మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంపై అప్పుడే అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. 


Posted by Andhra Gossips on 04:51. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips