పవన్ సిటీలోనే ఉండి 'రచ్చ' పంక్షన్ కి రాలేదా?
రచ్చ ఆడియో పంక్షన్ లో పవన్ కల్యాణ్ మిస్ అవటం అందరినీ మరోసారి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆ పంక్షన్ లో కొందరు అభిమానులు అయితే పవన్ రాకపోవటం గమనించి.. పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరిచారు. మరికొందరు అయితే గుడ్లు, ఖాళీ బాటిల్స్ ని స్టేజి మీదకు విసరటానకి ప్రయత్నించారు. అయితే అస్సలు ఏమి జరిగింది. మెగా కుటుంబ సభ్యులు మధ్య విభేధాలు మరోసారి భగ్గుమన్నాయా.. అంటూ ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీ ఓ కధనాన్ని ప్రచరించింది.
ఆ రోజు స్టేజిపై రామ్ చరణ్, చిరంజీవి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ పనిమీద అమెరికా వెళ్లాడని అన్నారు. అయితే అదే రోజు సిటీ అవుట్ స్కర్ట్ లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నాడని అంటున్నారు. దానికి ఆధారంగా అదే రోజు..హరీష్ శంకర్ తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ను,రామ్ లక్ష్మణ్ ల ట్వీట్ లను ప్రస్తావిస్తున్నారు. హరీష్ శంకర్ ఆ ట్వీట్ లో... రచ్చ ఆడియో పంక్షన్ మిస్ అవుతున్నాను. రేపు తియ్యాల్సిన గబ్బర్ సింగ్ క్లైమాక్స్ ప్రిపరేషన్ లో ఉన్నాను అన్నారు. అంటే ఆ మరుసటి రోజు పవన్ క్లైమాక్స్ షూట్ లో పాల్గొన్నారన్నమాట. అలాగే.. రామ్ లక్ష్మణ్ లు తమ ట్వీట్ లో... పవన్ సార్ తో వర్క్ చేస్తున్నాం... ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నాం అని మార్చి 12న ట్వీట్ చేసారు.
ఇక పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ ని సిటీ అవుట్ స్కర్ట్ లోని ఎంటర్టైన్మెంట్ పార్క్ వద్ద షూట్ చేసారని చెప్తున్నారు. దీన్ని బట్టి పవన్ అమెరికా వెళ్లలేదని తేల్చి చెప్తున్నారు. ఇవన్నీ చూపుతూ పవన్ అభిమానులకు ఎందుకు అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు... తమ కుటుంబంలో కలతలను కప్పిపుచ్చటానికేనా అని ప్రశ్నిస్తున్నారు.
