Negitive Comments on Ramcharan's Bollywood Entry
People draw comparison between Cherry and Amitabh. Its not gonna be easy for him to match a legend like Amitabh. Altogether, a very risky decision.
రామ్ చరణ్ త్వరలో జంజీర్ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో బాలీవుడ్ పత్రికలు రకరకాలుగా ఈ ఎంట్రీని కామెంట్ చేస్తున్నాయి. అమితాబ్ వంటి స్టార్ చేసిన చిత్రంలో రామ్ చరణ్ అనే సౌత్ హీరోయిన్ చేసి మెప్పిస్తాడా అని వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. అయినా జంజీర్ సినిమా ఇప్పటికే కొన్ని వందల సార్లు ఇండియన్ తెరపై వచ్చింది. ఇప్పుడు కొత్త హీరో కొత్త సబ్జెక్టుతో రాక ఇలాంటి సినిమా ఎందుకు అన్నట్లు గా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే జంజీర్ నాటికి అమితాబ్ ఏమీ స్టార్ హీరో కాదని, ఆ సినిమా తర్వాత అతని స్టార్ డమ్ వచ్చిందని, రామ్ చరణ్ కి కరెక్టు లాంచింగ్ ఫిల్మ్ అని కొందరంటున్నారు. అమితాబ్ చేసిన పాత్రను కొత్త కుర్రాడు ఎలా చేసాడా అన్న ఆత్రుతతో చూడటానికి వస్తారని అంటున్నారు. అలాగే జంజీర్ ని ఈ కాలానికి తగినట్లు ఎలా మార్చారో చూడటానికి జంజీర్ చిత్రం అభిమానులు గ్యారెంటీగా చూస్తారని చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ కి నష్టమేమి ఉండదని,ఎందుకంటే ఇదే చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తారు కాబట్టి మార్కెట్ పరంగా ఓ రేంజిలో ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.
ఇక ఒక కొత్త హీరో గానీ, మార్పు కానీ వచ్చేటప్పుడు రకరకాల నెగిటివ్ కామెంట్స్ రావటం సహజం. ఇప్పుడదే బాలీవుడ్ లో జరుగుతోంది. సౌత్ నుంచి వచ్చే హీరో బాలీవుడ్ ని ఏలతాడు అనే దాన్ని వారు జీర్ణించుకోలేకే ఇలా కామెంట్స్ చేస్తున్నారని కొందరు చెప్తున్నారు.
