|

Jr NTR Trivikram New Movie Confirmed

Sometime ago it was widely speculated that Trivikram Srinivas would be directing Ntr soon under a prestigious banner. And the latest development in this Ntr, Trivikram movie is that the story discussions have been over and the actor gave his go ahead nod to the director.


యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన స్టోరీ డిస్కర్షన్ పూర్తయి సినిమా ఖరారైంది. త్రివిక్రమ్ ఇటీవల జూ ఎన్టీఆర్‌ను కలిసి కథ వినిపించాడని, కథ బాగా నచ్చి జూనియర్ ఎంతో ఎగ్జైట్ అయ్యాడని, వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


ప్రస్తుతం జూ ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రంలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో త్రిష, కార్తీక హీరోయిన్లు. మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత జూనియర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ చిత్రం చేయనున్నాడు. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుగబోతోంది.



ఈరెండు చిత్రాలు పూర్తయిన తర్వాత జూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్-ఇలియానా జంటగా హనీ(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Posted by Andhra Gossips on 09:33. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips