|

నా ఫేవరెట్ మహేష్ బాబు కోసమే చేసా...!?

South hot actress Parvathi Melton who has set the screens on fire with her sizzling item song in Mahesh Babu's Dookudu ran up the mass audience to the theatres.Parvathi Melton has yet signed up a new film in telugu. Parvathi Melton has got many offers for the item songs after her scintillating item number in Dookudu.


వెన్నెల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పార్వతీమెల్టన్‌ కు ఆ చిత్రం తర్వాత మంచి గుర్తింపునిచ్చిన చిత్రం జల్సా. ఆ చిత్రం తర్వాత కొన్నికారణాల వల్ల తెలుగు చిత్రాల్లో కనిపించకుండా పోయిన పార్వతీమెల్టన్ ఇటీవల విడుదలైన మహేష్ దూకుడుతో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆటో అప్పారావు ... అంటూ మహేష్‌తో పాటు కుర్రకారుకి టెన్షన్ పుట్టించిన ఈ సుందరి ఈ ప్రత్యేక గీతంతో ఒక్క సారిగా తెలుగు చిత్ర పరిక్షిశమలోకి రీఎంట్రీ ఇచ్చింది. మహేష్‌తో ఖలేజా చిత్రంలో నటించాల్సివున్నా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం నుంచి తప్పుకున్న ఈ ముద్దుగుమ్మ చివరికి తన దూకుడు చూపించి ఎట్టకేలకు మహేష్‌ తో నటించాలన్న ముచ్చట తీర్చుకుంది.


మహేష్ సినిమాతో తన కెరియర్ లో ఎన్నడూ లేనంతగా క్రేజ్ ఏర్పడింది. దూకుడు సినిమాలో చాలా హాట్ హాట్ గా కనిపించిన పార్వతితో తమ సినిమాలో ఎలాగైనా ఓ ఐటెం సాంగ్ చేయించాలని బడా నిర్మాతలు ఎదురు చూస్తున్నారట. అయితే పార్వతి నుండి మాత్రం వీరికి నిరాశే ఎదురవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు తనకున్న క్రేజ్ ని సరిగ్గా వాడుకుని హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవాలని ఆశపడుతున్న పార్వతి తన దగ్గరకి వచ్చిన నిర్మాతలతో ఆ ఐటెం తన ఫేవరెట్ హీరో మహేష్ కోసమే ఇష్టపడి చేసానని ఇకపై తన దృష్టి అంతా కథానాయిక పాత్రలపైనే అని తెగేసి చెబుతుంది. 


Posted by Andhra Gossips on 22:50. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips