సమంత ఘాటు కౌంటర్ మీడియాకు
తెలుగులో నేను నటించిన మూడు సినిమాలూ విజయం సాధించడం నిజంగా నా అదృష్టమే. అయితే... వాటిల్లో సమంత కాకుండా ఏ హీరోయిన్ నటించినా అవి అంతే స్థాయిలో సక్సెస్ సాధించేవి. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అలాంటప్పుడు నేనెందుకు రెమ్యునేషన్ పెంచాలి అంటూ ఎదురు ప్రశ్నించిది సమంత. దూకుడు విజయం సాధించడంతో కోటి రూపాయల పారితోషికాన్ని సమంత డిమాండ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలను ఖండిస్తూ సమంత పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ నిరాధారమైన ఇలాంటి వార్తలు మనస్తాపానికి గురి చేస్తుంటాయి అంది. దాంతో మీడియావారు ఈ కౌంటర్ కి ఏమనాలో అర్దం కాని స్ధితిలో పడిపోలేదు. అలాగే... తెలుగు నేర్చుకుంటున్నానని ఆమె తెలిపారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో మరోమారు నటిస్తున్నట్టు చెప్పారు. ఇక ఎన్టీఆర్ గురించి చెప్తూ అతనూ గొప్ప నటుడే కాక మంచి హ్యూమన్ బీయింగ్ అంది. అతని తో మళ్లి చేయాలని కోరుకుంటున్నాను అంది. ఇక తను పనిచేసిన ఎన్టీఆర్, మహేష్, నాగచైతన్యలు ఫేవరెట్ స్టార్సే అయనప్పటికీ నాగచైతన్యే నాకు బాగా క్లోజ్ అంది.
ఇక దూకుడులోని తన పాత్రను తాను చాలా ఎంజాయ్ చేసానని చెప్పింది. నాకు షూటింగ్ మొదటి రోజు నుంచి తెలుసు దూకుడు చిత్రం మొత్తం మహేష్ కేంద్రంగా జరిగే కథ అని అందుకే ఏ సమస్యా రాలేదు అంది. ఇక దూకుడులో ఆమె పాత్ర కేవలం డాన్స్ లకే పరిమితం అవుతుంది. సెకెండాఫ్ లో పాత్ర నిడివి తగ్గిపోతుంది. ఇక ప్రస్తుతం సమంత డైరీ ఫుల్ గా ఉంది. ఆమె గౌతమ్ మీనన్ మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈగ లోనూ చేస్తోంది. అంతేగాక నాగచైతన్య సరసన ఆటోనగర్ సూర్యలోనూ, మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు.
