చిరు చరణ్ లది అయిపాయింది.ఇప్పుడు పవన్ వంతు
Powerstar Pawan Kalyan riding a horse in Gabbar Singh.
మెగాస్టార్ చిరంజీవి కొండవీటి దొంగ, కొదమ సింహం చిత్రాల్లో గుర్రపు స్వారీ చేస్తూ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కూడా మగధీరతో గుర్రపు స్వారీతో కేక పుట్టించాడు. తాజాగా పవన్ కళ్యాన్ కూడా తన తాజా సినిమా గబ్బర్ సింగ్ చిత్రంలో గుర్రపు స్వారీతో ఇరగదీయనున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రఫ్ క్యారెక్టర్లో కొండవీడు ప్రాంత పోలీస్‌గా కనిపించ బోతున్నాడు. పక్క చిత్రంలో పవన్ కళ్యాన్ గుర్రపు స్వారీ చేస్తున్నది ‘గబ్బర్ సింగ్’ చిత్రం కోసమే.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. పవర్ స్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ సూపర్ హిట్ మూవీ ‘దబాంగ్’ రీమేక్. మే 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 7న గబ్బర్ సింగ్ చిత్రం ఆడియో విడుదల కానుంది. హిందీలో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ చిత్రానికి ఇదీ రీమేక్. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే చిత్రానికి కమిట్ అయ్యారు.
