'గబ్బర్ సింగ్'పై చెత్త రూమర్ ప్రచారం
According to Rumours - Gabbar Singh might also taste the same result because of Aakash.
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ కి వస్తున్న పాజిటివ్ అప్లాజ్ కొందరికి గిట్టడం లేరు. వారు ఈ చిత్రంపై రకరకాల రూమర్స్ క్రియేట్ చేసి ప్రచారంలోకి తెస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రను చేస్తున్న పూరి కొడుకు ఆకాష్ ని టార్గెట్ చేసారు. ఆకాష్ కెరీర్ ని చూపిస్తూ ...గతంలో ఆకాష్ ..రామ్ చరణ తేజ చిరుత,ప్రభాస్ ఏక్ నిరంజన్ లలో హీరో చిన్నప్పుడు పాత్రల్లో చేసాడని అవి రెండు పెద్దగా ఆడలేదని అంటున్నారు. అలాగే రీసెంట్ గా ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్..ధోని చిత్రం పెద్ద ప్లాఫ్ అయిందని, లోటస్ పాండ్ అనే చిత్రం అయితే అసలు రిలీజ్ కూడా కాలేదని గుర్తు చేస్తున్నారు.
దీన్ని బట్టి గబ్బర్ సింగ్ పరిస్ధితి ఆలోచించుకోమని అంటున్నారు. ఆ పిల్లవాడు పై చిత్రీకరించిన సీన్స్ తీసేసి..వేరే కుర్రాడిపై ఆ సీన్స్ షూట్ చేస్తే బెస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారు చెప్తున్నట్లుగా రామ్ చరణ్ చిరుత ఆడకుండా పోలేదు. ఆ చిత్రం రామ్ చరణ్ కెరీర్ కి ప్రారంభంలోనే మంచి కిక్ ఇచ్చి నిలబెట్టింది. ఇక ధోని చిత్రం అయితే ప్రకాష్ రాజ్ కి దర్శకుడుగా మంచి పేరు తెచ్చిపెట్టింది. లోటస్ పాండ్ చిత్రం ఫిలిం ఫెస్టివల్స్ కు వెళుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా గబ్బర్ సింగ్ తో పవన్ గ్యారెంటీగా హిట్ కొడతాడని అందరిలో బాగా నమ్మకం పెరిగింది. అందుకే ఇలాంటి అర్దంపర్దం లేని రూమర్స్ క్రియేట్ చేసి ఆనందపడుతున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
