People Likes Hot Gossips Shruti Hassan
కమల్ హాసన్ తనయ శృతి హాసన్‌పై ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ ప్రాచారంలో ఉంటున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థతో ప్రేమాయణం నడుపుతోందని, ఇప్పటికే పెళ్లయిన అతన్ని రెండో పెళ్లి చేసుకుంటోందని కొంత కాలం గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆమె రజనీకాంత్ అల్లుడికి దగ్గరైందని, ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే గాసిప్స్ గుప్పుమన్నాయి. ఇలా రకరకాలు ఆమెపై పుకార్లు వినిపస్తూనే ఉన్నాయి. ఈ విషయాలపై స్పందించాల్సిందిగా శృతి హాసన్‌ను ప్రశ్నించగా...‘‘అందరికీ అలాంటి వేడి వార్తలే కావాలి. ఆ తర్వాత మర్చి పోతారు. రోజుల తరబడి గుర్తుంచుకునే తీరిక ఎవరికీ లేదు. అందుకే వాటికి ప్రాముఖ్యత ఇవ్వను’’ అని స్పష్టం చేసింది.
తన నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ప్లాపులుగా నిలిచిన విషయమై మాట్లాడుతూ...కెరీర్లో జయాపజాయాలు సర్వ సాధారణం. మన ప్రతిభకి, వాటికీ ఏమాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా కథ ఎంపిక విషయంలో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? అని అడగ్గా..నా పాత్రపై ముందు అవగాహన పెంచుకోవడంతో పాటు, మిగిలిన పాత్రలు ఎలా ఉన్నాయి అనే విషయాలు పరిశీలిస్తాను. మిగతావన్నీ దర్శకుడికే వదిలస్తాను అని చెప్పుకొచ్చింది.
శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సరసన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తోంది. మరో వైపు ఆమె తమిళంలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ తో కలిసి నటించిన ‘3’ చిత్రం త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది.
