Priyamani Shocked by Surroundings
ప్రియమణి రీసెంట్ గా డ్రగ్ ఎడిక్ట్ నుంచి తప్పించుకుని తనను తాను రక్షించుకుందనే వార్త కోలీవుడ్ లో దావానలంలా పాకుతోంది. అక్కడ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రీసెంట్ గా చెన్నై వచ్చిన ప్రియమణి ఓ పబ్ లో సినీ వర్గాలకు చెందిన పార్టీకి హాజరైందిట. అయితే అక్కడ కొందరు తప్ప తాగి,మరికొందరు డ్రగ్స్ తీసుకుని ఆమెను అల్లరి చేయటం ప్రారంబించారు. అయితే మొదట లైట్ గా తీసుకున్న ఆమె ఆ తర్వాత అవి తీవ్రం అవటంతో భయపడింది. దాంతో అక్కడనుంచి బయిటపడటానికి ప్రయత్నించింది. దానికి వారు అడ్డగించారు.
ఈ నేపధ్యంలో ఆమె పబ్ కి చెందిన వారిని ఎలర్ట్ చేసి తప్పించుకుంది. అయితే ఇదేమి నిజం కాదని ప్రియమణి కొట్టిపారేస్తోంది. అలాంటి వార్తలు ఎలా పుడతాయో అర్దం కావటం లేదంటూ ఆమె ఓ తమిళ పత్రికతో అంది. తాను ఈ వార్త విని చాలా షాక్ కు గురి అయ్యానని అంది. అలాగే ఆ మధ్య సిసి ఎల్ టైమ్ లోనూ తన మీద విచిత్రమైన వార్తలు స్ప్రెడ్ అయ్యాయని అంది. ఇక ప్రియమణి తెలుగు,తమిళ భాషల్లో సినిమాలు లేవు. ఆమె అక్కడ,ఇక్కడా తనకు పరిచయాలున్న దర్శకులు,హీరోలు చుట్టూ తిరుగుతోంది. హాట్ హాట్ స్టిల్స్ వదిలి వారిని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఆమె ఎప్పుడో తమిళంలో నటించిన పరుత్తి వీరన్ డబ్బింగ్ మల్లిగాడు టైటిల్ తో విడుదలై మంచిటాక్ తెచ్చుకుంది.
