అదే తప్పు ‘రచ్చ’ విషయంలో జరిగిందా?
ఏ తప్పయితే జరుగకూడదని రామ్ చరణ్ భావించాడో...అదే పొరపాటు ‘రచ్చ’ సినిమా విషయంలో జరిగిందా? ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందా?
‘ఆరెంజ్’ సినిమా ప్లాపవడానికి కారణం, ‘మెరుపు’ చిత్రం పక్కన పెట్టడాని కారణం భారీ బడ్జెట్టే. ఆరెంజ్ సినిమా కోసం అంచనాలకు మించిన బడ్జెట్ ఖర్జు పెట్టడం వల్లనే తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మెరుపు చిత్రం కమిట్ అయినా...బడ్జెట్ పరంగా తన మార్కెట్‌కు మించినది కావడంతో చెర్రీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాడు.
తన సినిమా రేంజ్‌కు తగిన విధంగా పరిమితమైన బడ్జెట్‌తో ‘రచ్చ’ చిత్రానికి ప్లాన్ చేశారు. అయితే ‘రచ్చ’ విషయంలో కూడా అదే పొరపాటు జరిగి పోయింది. సినిమా బడ్జెట్ అంచనాలకు మించి పోయిందని సమాచారం. ఈచిత్రం బడ్జెట్ ఇప్పటికే 30 కోట్లు క్రాస్ అయిందని అంటున్నారు.
ఏమైంది ఈ వేళ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సంపత్ నంది...చెర్రీ లాంటి పెద్ద హీరోతో అవకాశం రావడంతో చిత్రాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కిస్తున్నాడని, యాక్షన్ సన్నివేశాలు, పాటలు, ప్రతి సీన్ విషయంలో రిచ్ కోసం ప్రయత్నిస్తున్నాడని, అందుకే సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువయిందని అంటున్నారు. ఈచిత్రంలో చైనాలో తీసిన ఓ ఫైట్ సీన్ కోసం కోటికి పైగా ఖర్చు చేశారట. ఇలా ప్రతి దానికి ఖర్చు పెరిగి పోయి బడ్జెట్ తడిసి మోపడైందని టాక్.
అయితే బడ్జెట్ పెరగడంపై నిర్మాత లోలోన ఆందోళన చెందుతూనే...సినిమా హిట్టయితే 10 రోజుల్లో సంపాదించుకోవచ్చనే ధైర్యంతో ఉన్నాడటని చర్చించుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ చిత్రంలో చెర్రీ సరసన తమన్నా నటిస్తోంది. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
