Ram Charan Suffering From Major Injury
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రచ్చ షూటింగులో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆయన కాలి కండరాలకు బలమైన గాయం అయింది. వైద్యులు అతనికి దాదాపు నెల రోజులు పాటు విశ్రాంతి అవసరమని, షూటింగుకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది
రచ్చ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రకరణ సాగుతోంది. ఇందులో భాగంగా అన్నపూర్ణ స్టూడియోలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో పాటల చిత్రీకరణ జరుగుతుండగా కఠినమైన స్టెప్పులు వేసే క్రమంలో గాయ పడ్డాడు. ఇంకా ఈ చిత్రంలో మరో రెండు పాటల చిత్రీకణ జరుగాల్సి ఉంది.
ఈచిత్రం ఆడియోను రేపు నెక్లెస్ రోడ్లో ప్లాన్ చేశారు. అదే విధంగా మార్చి చివరి వారంలోగానీ, ఏప్రిల్ తొలి వారంలో గానీ విడుదల చేయాలని నిర్ణయించారు. చెర్రీకి గాయం అయిన నేపథ్యంలో చిత్రీకరణ మరింత ఆలస్యమై, సినిమా విడుదల కూడా లేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు జరుగబోయే ఆడియో వేడుకకు కూడా చరణ్ వస్తాడా? లేదా? అనేది కూడా సందేహంగానే ఉంది.
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ వి ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.
