Rajamouli Doesn't Direct Chiranjeevi 150th Film
తన నూట యాభైవ చిత్రానికి శంకర్ లేదా మరెవరైనా దిగ్గజ దర్శకుడు పని చేస్తే బాగుంటుందని చిరంజీవి చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. వినాయక్, పూరి జగన్నాథ్ లాంటి వాళ్లు చిరుతో పని చేయడానికి సిద్దంగా ఉన్నాకానీ ఆయన మాత్రం వారి కంటే పెద్ద రేంజ్ వాళ్లతో చేయాలిన అనుకుంటున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి దృష్టి రాజమౌళి పై పడిందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల చెప్పా పెట్టకుండా ‘ఈగ’ సినిమా సెట్స్ మీద చిరంజీవి వాలడం ఈ చర్చకి తావిచ్చింది.
అయితే చిరంజీవి నటించే 150 వ సినిమాకి తాను దర్శకత్వం వహిస్తున్నానంటూ వస్తున్న వార్తలను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఖండించాడు. 50 కోట్ల ప్యాకేజీతో చిరంజీవి తన సినిమా బాధ్యతలను రాజమౌళి చేతిలో పెట్టాడంటూ ఇటీవల కొన్ని వార్తలొచ్చాయి. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని రాజమౌళి అంటున్నాడు. ప్రస్తుతం తాను చేస్తున్న 'ఈగ' సినిమా తర్వాత ప్రభాస్ తో రూపొందించే సినిమా స్టార్ట్ అవుతుందనీ, ఆ కమిట్ మెంట్స్ లో ఎటువంటి మార్పూ లేదని చెప్పాడు.
అలాగే, ఇటీవల రామానాయుడు స్టూడియోలో తాను 'ఈగ' షూటింగులో వుండగా తన సెట్స్ కు చిరంజీవి వచ్చినట్టుగా 'ఓ ప్రముఖ పత్రిక'లో వచ్చిన వార్తను కూడా రాజమౌళి సవరించాడు. 'చిరంజీవిగారు నన్ను కలవడానికి వచ్చేరన్నట్టుగా వార్త రాశారు. అది వాస్తవం కాదు. స్టూడియోకి ఆయన వేరే పని మీద వస్తే, నేనే వెళ్లి కల్సి గ్రీట్ చేశాను' అన్నాడు రాజమౌళి.
