|

Rajamouli Eega Weapon Needle


ప్రముఖ దర్శకుడు రాజమౌళి త్వరలో ‘ఈగ’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. నాని, సమంత, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 5 లేదా 12న విడుదలవుతుందని ప్రచారం జరుగుతున్నా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. సాంకేతిక విలువలతో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారత దేశంలో ఇదివరకెన్నడూ లేని విధంగా రాబోతోందని అంటున్నారు. 

ఆ విషయం పక్కన పెడితే...రాజమౌళి సినిమాల్లో అందరినీ ఎక్కువగా ఆకర్షించేది ఆయన సినిమా హీరో చేతుల్లో ఉండే ఆయుధం. సింహాద్రి, చత్రపతి, విక్రమార్కుడు చిత్రాల్లో హీరో కోసం ప్రత్యేకంగా ఆయుధాలను డిజైన్ చేయించాడు జక్కన్న.

తాజాగా ‘ఈగ’ సినిమాలో కూడా ఆయుధాన్ని చేర్చాడు ఈ దర్శకుడు. ఈ చిత్రంలో హీరో నాని అయినా సినిమా ప్రారంభం అయిన కొంత సేపటికే నాని విలన్ చేతిలో చని పోతాడు. దీంతో నాని ఆత్మ ఈగలో దూరుతుందట. విలన్ పవర్ ఫుల్ కాబట్టి ఈగ చేతిలో ‘సూది’ని ఆయుధంగా పెట్టాడు. బహుషా ఆ సూదితోనే విలన్‌ను ఈగ గుచ్చి గుచ్చి చంపుతుందేమో..? చూడాలి.


Posted by Andhra Gossips on 09:27. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips