Salman Khan Rejects Allu Arjun Movie
బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ గత కొంత కాలంగా వరుసగా దక్షిణాది సినిమా రీమేకుల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన దక్షిణాది చిత్రాల రీమేక్స్ వాంటెడ్, రెడీ, బాడీగార్డ్ ఉత్తరాదిన భారీ విజయం సాధించడంతో పాటు, వందల కోట్ల రూపాయల లాభాలను తెచ్చి పెట్టాయి. ఈ నేపథ్యంలో యుటీవీ పిక్చర్స్ వారు తెలుగులో అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య2’ చిత్రాన్ని కూడా సల్మాన్ హీరోగా రీమేక్ చేయించాలని ప్రయత్నించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఆర్య2 చిత్రం రీమేకులో నటించడానికి నో చెప్పాడన సమాచారం. తెలుగులో భారీ విజయం సాధించిన దూకుడు చిత్రం రీమేక్‌లో కూడా నటించడానికి సల్లూ భాయ్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
దక్షిణాది రీమేకులు చేయడం మానేయాలనే ఉద్దేశ్యంతోనే సల్మాన్ ఇలా వరుస ఆఫర్లను తిరస్కరిస్తున్నారని, వయసు పైబడుతున్న తరుణంలో రీమేకుల హీరోగా కాకుండా, తన తోటి ఖాన్లయిన షారుఖ్, అమీర్‌లకు ధీటుగా నిలవడం కోసమే ఇలా చేస్తున్నాడట ఈ బడా హీరో. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఎక్ థా టైగర్ చిత్రంలో నటిస్తున్నాడు. అనంతరం శేర్ ఖాన్, దబాంగ్ 2 చిత్రాల్లో నటించనున్నాడు.
