తెలుగులో రికార్డులను తిరగరాసిన రజనీకాంత్
కోచ్చడయాన్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అనేక భాషల్లో ఒకేసారి రిలీజవుతున్న ఈ సినిమా హక్కులు తెలుగులో ఇంతవరకు ఏ తెలుగు సినిమా సృష్టించని రికార్డును నెలకొల్పింది. ఒక డబ్బింగ్ సినిమా అయినా కూడా రజనీకాంత్ పేరు మీద ఈ సినిమా హక్కులు ముప్ఫై కోట్లకు అమ్ముడుపోయాయి. ఇది నూట యాభై కోట్లతో తీసిన రోబో సినిమా హక్కుల కంటే ఎక్కువ. అది ఇక్కడ ఇరవై ఏడు కోట్లకు అమ్ముడుపోయింది. దాన్ని కోచ్చడయాన్ బీట్ చేసింది. ఇంతవరకు ఒక్క తెలుగు సినిమా డీల్ కూడా ఔట్ రైట్ గా 30 కోట్లు అమ్ముడు పోలేదు. కొన్ని సినిమాలు మంచి బిజినెస్ చేసినా మూడు ఏరియాలను వేర్వేరు పంపిణీ దారులు తీసుకోవడం వల్ల ఇంతవరకూ ముప్పయి కోట్లకు మించిన డీల్ ఏదీ తెలుగు ఇండస్ట్రీలో కుదరలేదు. ఆ లెక్కన సింగిల్ డీల్ కింద అత్యధికంగా అమ్ముడుపోయిన సినిమా గా ఒక తమిళ డబ్బింగ్ సినిమా నిలవడం ఒక రకంగా తెలుగు సినిమాకు అవమానమే కావచ్చు.. కానీ అది తమిళ సినిమా టాలెంట్ కాదు. రజనీకాంత్ కు ఉన్న క్రేజ్. ఆయనను ఎందులో అయినా ఢీకొట్టగల ఘనుడు భారతీయుల్లో ఉన్నారా?
