రాంచరణ్ సినిమాకు రచయితల గండం !
సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘జంజీర్’ చిత్రం రీమేక్ తో బాలీవుడ్ లోకిభారీగా ఎంట్రీ ఇద్దామనుకున్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ ఆశలకు రచయితల రూపంలో గండం వచ్చిపడింది. ప్రకాష్ మొహ్రా నిర్మాణంలో అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్పి ఉంది. దీనికి సంబంధించి ఏప్రిల్ నెల నుండి షూటింగ్ కూడా జరిపేందుకు సిద్దం చేసుకున్నారని సమాచారం.
అయితే అప్పట్లో ‘జంజీర్’ సినిమాకు సలీమ్ – జావెద్ రచయితలు. ఈ సినిమా రీమేక్ కు సంబంధించి ఆ చిత్రం అప్పటి దర్శక, నిర్మాతలు ఇప్పటివరకు మాటమాత్రంగానైనా రచయితలకు చెప్పలేదట. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా తమను పట్టించుకోకపోవడం పట్ల వారు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఈ విధంగా చేయడం మమ్మల్సి తీవ్రంగా భాధించిందని, తాము కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నామని అంటున్నట్లు సమాచారం. సో చరణ్ సినిమాకు ఆదిలోనే హంసపాదులు ఎదురవుతున్నాయన్న మాట. చూద్దాం ఏం జరుగుతుందో ?
