Ram Charan Rejected
రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు సంగీతం అందించటానికి అందరు సంగత దర్శకులూ ఉత్సాహం చూపిస్తారు. అయితే తాజాగా దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఆసక్తి చూపటం లేదని,ప్రాజెక్టుని సున్నితంగా రిజెక్టు చేసాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే అది తెలుగులో రామ్ చరణ్ చేస్తున్న చిత్రానికి వచ్చిన ఆఫర్ కాదు. హిందీలో త్వరలో రామ్ చరణ్ చేయనున్న జంజీర్ రీమేక్ నిమిత్తం సంగీత దర్సకుడుగా దేవిని పెట్టుకోవాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని దేవి కి సైతం తెలిపినా ఆయన సున్నితంగా వద్దని కొత్తగా ఎంట్రీ ఇస్తున్నావు కాబట్టి బాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ ని తీసుకోమని సూచించాడని తెలుస్తోంది. దానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ కు బాలీవుడ్ పై చాలా అంచనాలు, ఆశలు, ఆలోచనలు ఉన్నట్లు చెప్తున్నారు.
అతని పాటలు ఆల్రెడీ బాలీవుడ్ సర్కూట్ లో హిట్టయ్యాయి. గతంలో సల్మాన్ ఖాన్ రెడీ చిత్రంలో ఆర్య 2 లోని రింగ రింగ పాటను తీసుకున్నారు. అది అక్కడ పెద్ద హిట్టైంది. అలాగే ఇప్పుడు ఆర్య లోని అ అంటే అమలాపురం పాటను సైతం టబు నటిస్తున్న ఐటం సాంగ్ కి రైట్స్ తీసుకున్నారు. ఈ నేపధ్యంలో దేవిశ్రీ ప్రసాద్ కి రామ్ చరణ్ లాగ కొత్తగా బాలీవుడ్ కి ఎంట్రీ అవుతున్న హీరోలతో లాంచ్ అవటం కన్నా అక్కడ ఆల్రెడీ సెటిలైన సల్మాన్ లాంటి స్టార్ హీరోతో పనిచేస్తే వచ్చే గుర్తింపు వేరని భావించే ఇలా రిజెక్టు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
