Ram Charan Use His Surname Racha
Mega Power Star Ram Charan is the first to use his 'surname in lyric' in a song from his upcoming movie 'Rachcha' which goes like 'Konidela vari Kodaka'.
తర తరాలుగా తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్న నాలుగుగైదు సినీ కుటుంబాలు.....అప్పుడప్పుడు తమ వంశాన్ని సినిమాల్లో పొగుడుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం. నాగార్జున, బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా పలువురు హీరోలు తమ సినిమాల్లోని పాటల్లో వంశం ప్రస్తావన తెచ్చినవారే. దర్శకులు గీత రచయితలకు ప్రత్యేకంగా చెప్పిమరీ ఇలాంటి పాటలు రాయిస్తుంటారు.
నాగార్జున నటించిన ఆటో డ్రైవర్ చిత్రంలో ‘అక్కినేని అక్కినేని’ అనే సాంగు ఉంటే, బాలయ్య నటించిన సమర సింహారెడ్డి చిత్రంలో ‘నందమూరి నాయకా’ అనే పాట, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ చిత్రంలో ‘నందమూరి చందమామ’ అనే పాట, అల్లు అర్జున్ నటించిన ఆర్య చిత్రంలోని అ అంటే అమలాపురం పాటలో ఓ లైన్లో ‘అల్లువారి పిల్లగాడ అల్లు కోరా సందెకాడ’ అనే సాంగు ఉంది.
వంశాన్ని పొగుడుకునే హీరోల లిస్టులో తాజాగా రామ్ చరణ్ కూడా చేరాడు. చెర్రీ తాజాగా నటించిన ‘రచ్చ’ సినిమాలోని ఓ పాటలో ‘కొనిదెల వారి కొడకా’ అనే వ్యాఖ్యాన్ని చేర్చారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన రచ్చ మూడీ ఆడియో ఆదివారం విడుదలైంది. మణిశర్మ సంగీతం సమకూర్చారు. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు.
