|

Power Star busy With Car Chases

Power Star Pawan Kalyan’s mass action entertainer ‘Gabbar Singh climax sequence is being shot currently on the Hyd – Vijayawada national highway and this sequence is said to contain some super car chase sequences.


పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్- విజయవాడ హైవేమీద కార్ జేజింగ్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 


హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. పవర్ స్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ సూపర్ హిట్ మూవీ ‘దబాంగ్’ రీమేక్. మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 



ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే చిత్రానికి కమిట్ అయ్యారు. పవర్ స్టార్ మేనరిజానికి సరిపోయే ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అనుష్క, నయనతార, కాజల్ లాంటి టాప్ హీరోయిన్లు పరిశీలిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


Posted by Andhra Gossips on 19:04. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips