ట్యూషన్ చెప్పించుకుంటున్న రామ్ చరణ్
Ram Charan Teja is also keen to dub his lines for Zanjeer and freshly he has hired a tutor to improve his diction in Hindi, says filmnagar sources.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ యువకుడిగా ఉన్నప్పుడు నటించిన సూపర్ హిట్ మూవీ ‘జంజీర్’ చిత్రం రీమేక్ ద్వారా చెర్రీ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి రామ్ చరణ్ స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు. అయితే మనోడికి హిందీ మాట్లాడటం పర్ ఫెక్టుగా రాదు కాబట్టి....ఇప్పటి నుంచే ఓ ట్యూటర్‌ను పెట్టుకుని హిందీ నేర్చుకుంటున్నాడట. మన తెలుగు యాస(స్లాంగ్)లో హిందీ మాట్లాడకుండా బాలీవుడ్ యాసను ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెర్రీ సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని, హిందీతో పాటు తెలుగులోనూ ఒకే సారి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అపూర్వ లఖియ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం చరణ్ ‘రచ్చ’ చిత్రంలో నటిస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్. మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
