|

10 నిమిషాలకు...కత్రినా రెమ్యూనరేషన్ రూ. కోటి

Katrina Kaif will be making a brief visit to Kochi to walk the ramp at an upcoming fashion do, to be held on March 25. Those involved with organizing the do tell us that Katrina is allegedly being paid as much as `1 crore to be on the ramp for exactly 10 minutes.



బాలీవుడ్ హాట్ లేడీ కత్రినా కైఫ్ మరోసారి వార్తల్లో నిలిచింది. హీరోయిన్‌గానే కాక ఐటం సాంగుల్లోనూ దూసుకెలుతున్న ఈ భామ తాజా ఓ ర్యాంపు వాక్‌లో పాల్గొనడానికి సిద్ధం అవుతూ వార్తల్లో వ్యక్తిగా మారింది. కత్రినా సాధారణంగా ర్యాంపు వాకుల్లో పాల్గొంటూనే ఉంటుంది. అయితే ఈ ర్యాంప్ వాక్ ప్రత్యేకత వేరు. కేవలం పది నిమిషాలు ర్యాంప్‌పై హొయలొలికిస్తూ నడవటానికి కత్రినాకు రూ. కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట. మార్చి 25న కొచ్చిలో ఇందుకు సంబంధించిన ఫ్యాషన్ షో జరుగనుంది. ఇప్పటి వరకు దక్షిణాదిన జరిగిన ఫ్యాషన్ షోలలో ఏ హీరోయిన్ కూడా ఇంత పెద్ద మొత్తంలో ర్యాంప్ వాక్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు. అయితే గతంలో షారుఖ్ మాత్రమే కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో కోటికిపైగా తీసుకున్న వారిలో ఉన్నారు.


దక్షిణాదిని ఇప్పటి వరకు ర్యాంపు షోలకు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్న వారిలో త్రిష, లక్ష్మి రాయ్, శ్రియ, మాధవన్ ఉన్నారు. వీరు ఇందు కోసం రూ. 20 నుంచి 40 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక సురేష్ గోపి, సమృత సునిల్, కావ్యా మాధవన్ తదితరులు రూ. 2 లక్షల నుంచి 12 లక్షల వరకు తీసుకుంటున్నారు. అనన్య, భావన, రీమా కలింగల్, నంబీసన్, విమల రామన్, అర్చన కవి తదితరులు రూ. 1 లక్ష నుంచి 2 లక్షలు తీసుకుంటున్నారు.



Posted by Andhra Gossips on 08:39. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips