Rumor on Ram Charan Racha
రామ్ చరణ్ రచ్చ త్వరలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై ప్రతీ రోజు రకరకాల వార్తలు, రూమర్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం డైరక్టర్ పై ఓ గమ్మత్తైన రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రం దర్శకుడు సంపత్ నందికి ఇది రెండో చిత్రం కావటంతో అతను కొన్ని సీన్స్ ముఖ్యంగా ఫైట్ ఎపిసోడ్స్ సరిగ్గా డీల్ చెయ్యలేక పోయాడని చెప్పుతున్నారు. అయితే ఆ లోటుని వివి వినాయిక్ సహకారంతో రామ్ చరణ్ చేసుకున్నాడనే రూమర్ స్టార్టైంది.
ఇలాంటి రూమర్ ప్రారంభం కావటానకి కారణం ఈ దర్శకుడు మొదట ఏ పెద్ద హీరోని డైరక్ట్ చెయ్యకపోవటమే అంటున్నారు. అతను డైరక్ట్ చేసిన తొలి చిత్రంలో హీరో వరణ్ సందేశ్ కావటం..అదీ లవ్ సబ్జెక్టు కావటంతో ఇలాంటి రూమర్స్ ప్రచారంలోకి తెస్తున్నారు. ఇక రచ్చలో టైటిల్ సాంగ్ ఇప్పటికే నెట్ లో విడుదలై పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ సైతం రామ్ చరణ్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇవన్నీ చూస్తూంటే ఈ చిత్రం ఘన విజయం సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.
