అమ్మకానికి సూపర్ స్టార్ కారు!
Salman Khan is apparently keen on selling one of his favourite cars - a Toyota Land Cruiser. The car is the one which Salman Khan was using in September 2002 when he crashed into a pavement killing one pavement dweller and injuring four other people. Salman is still undergoing trial for the incident.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కారు టాయోటా ల్యాండ్ క్రూయిసర్‌ను అమ్మకానికి పెట్టబోతున్నాడు. 2002లో ఈ కారు ప్రమాదానికి గురై ఒక మనిషి బలితీసుకోవడంతో పాటు నలుగురిని తీవ్రంగా గాయ పరిచింది. గతంలో ప్రమాదానికి గురైన ఈ కారు అమ్మకానికి పెట్టేందుకు అనుమతి కోసం సల్మాన్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ కారు తనకు అచ్చి రాక పోవడంతో పాటు బాగా పాతది కావడంతో ఆ కారును వదిలించుకోవడానికి సల్మాన్ ట్రై చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ వాడిన కారు కావడంతో చాలా మంది ఈ కారును దక్కించుకోవడానికి పోటీ పడతారనే అంచనాలున్నాయి. మరి ఈ కారును దక్కించుకునేది ఎవరో? ఎంత రేటు పలుకుతుందో కొన్ని రోజుల్లొ తేలనుంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దబాంగ్ 2 చిత్రంతోపాటు, ఏక్ థా టైగర్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఏక్ థా టైగర్ చిత్రంలో సల్మాన్ తన మాజీ ప్రియురాలు కత్రినా కఫ్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. దబాంగ్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న దబాంగ్ 2 చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్. ఈచిత్రాల తర్వాత సల్మాన్ మరో భారీ ప్రాజెక్టుకు వ్యూహ రచన చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ. 300 కోట్లతో ఈ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నారని, ఇందులో కమల్ హాసన్, జాకీచాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని సమాచారం.
