Shruti Haasan is Bhagyalakshmi
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ చిత్రానికి ఇది రీమేక్.
హిందీ దబాంగ్ చిత్రంలో సల్మాన్ ‘ఛుల్ బుల్ పాండే’ పాత్రలో, సోనాక్షి సిన్హా ‘రాజో’ పాత్రలో నటించారు. కాగా...గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’గా నటిస్తుండగా శృతి హాసన్ ‘భాగ్య లక్మి’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రియురాలు భాగ్య లక్ష్మి అన్నమాట. దబాంగ్ చిత్రంలో రాజో మాదిరి భాగ్య లక్ష్మి పాత్ర విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో ఉంటుంది.
పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కొండవీడు పోలీస్‌గా దర్శనం ఇవ్వనున్నాడు. చట్టప్రకారం వెళితే నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం కొన్ని సందర్భాల్లో కష్టం. అందుకే గబ్బర్ సింగ్ తనదైన శైలిలో నేరస్తుల పని పడుతుంటాడు. ‘నాకు కొంచెం తిక్క ఉంది..దానికి ఒక లెక్క ఉంది’ అనే డైలాగ్ గబ్బర్ సింగ్ పాత్ర యొక్క స్వరూపాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రంలో ఇంకా సుహాసిని, కోట శ్రీనివాసరావు, అజయ్, అభిమన్యు సింగ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలి, మాస్టర్ ఆకాష్, మాస్టర్ సాయినాగన్, నానినీడు, సత్యం రాజేష్, రావు రమేష్, ఎం.ఎస్.చౌదరి, ఫిష్ వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : కడలి బ్రహ్మ, ఎడిటింగ్ : గౌతంరాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్ ఎస్.
